ఓవర్సీస్ లో మహానటి రికార్డు

Published On: May 16, 2018   |   Posted By:

ఓవర్సీస్ లో మహానటి రికార్డు

మహానటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తక్కువ థియేటర్లలో విడుదలై, కేవలం 7 రోజులకే ఇంత షేర్ రాబట్టడం నిజంగా విశేషం. ఇప్పుడీ సినిమా మరో రికార్డుకు అతి చేరువలో ఉంది. అది కూడా ఓవర్సీస్ లో కావడం చెప్పుకోదగ్గ విషయం.

ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదలైన 4 రోజులకే మిలియన్ మార్క్ అందుకుంది. ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది. నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే మహానటి సినిమాకు ఓవర్సీస్ లో 1.85 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇంకో 15 వేల డాలర్లు వస్తే సినిమా 2 మిలియన్ క్లబ్ లోకి చేరిపోతుంది.

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మహానటి 15వేల డాలర్లు ఆర్జించడం పెద్ద సమస్య కాదు. పైగా రేపట్నుంచి ఈ సినిమాకు ఓవర్సీస్ లో 17 స్క్రీన్స్ అదనంగా పెంచారు. సో.. మరికొన్ని గంటల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కానుంది.

Leave a Reply

Your email address will not be published.