ఓవర్సీస్ లో 6వ స్థానానికి చేరిన మహానటి

Published On: May 28, 2018   |   Posted By:

ఓవర్సీస్ లో 6వ స్థానానికి చేరిన మహానటి

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది మహానటి సినిమా. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా.. ఓవర్సీస్ లో కూడా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైన ఈ మూవీ.. ఈరోజు 2.5 మిలియన్ క్లబ్ లోకి జాయిన్ కాబోతోంది. అంతేకాదు.. తన వసూళ్లతో ఆల్ టైం టాప్ మూవీస్ లో ఆరో స్థానానికి ఎగబాకింది మహానటి సినిమా. ఖైదీ నంబర్ 150, అ..ఆ, ఫిదా లాంటి సినిమాల్ని వెనక్కి నెట్టింది.

ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలివే..
బాహుబలి 2 – $ 20,571,695
బాహుబలి 1 – $ 6,861,819
రంగస్థలం – $ 3,513,450
భరత్ అనే నేను – $ 3,414,795
శ్రీమంతుడు – $ 2,890,786
మహానటి – $ 2,450,000
అ..ఆ – $ 2,449,174
ఖైదీ నంబర్ 150 – $ 2,447,043
ఫిదా – $ 2,066,937
అజ్ఞాతవాసి – $ 2,065,527