కంగనా స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్

Published On: August 26, 2017   |   Posted By:
కంగనా స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్
బాలీవుడ్ మూవీ క్వీన్ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్‌తో సినిమాలో లీడ్ పాత్ర‌లో న‌టించిన కంగనా రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాను ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని సీనియ‌ర్ న‌టుడు త్యాగరాజ‌న్ హ‌క్కులను సొంతం చేసుకున్నాడు. క్వీన్ ఫాత్ర‌లో న‌టించే హీరోయిన్ కోసం చాలా అన్వేష‌ణ చేశారు. ఒక ద‌శ‌లో త‌మిళ క్వీన్ వెర్ష‌న్‌కు త‌మ‌న్నాను ఫైన‌ల్ అనుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల‌తో త‌మ‌న్నా ప్రాజెక్ట్  నుండి త‌ప్పుకోవ‌డంతో యూనిట్ వ‌ర్గాలు మ‌ళ్లీ హీరోయిన్ కోసం వేట‌లో ప‌డ్డారు.
                   తాజాగా ఇప్పుడు త‌మిళ వెర్ష‌న్ క్వీన్ ఫాత్ర‌లో న‌టించ‌డానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓకే అయ్యింది. ప‌దేళ్ల కెరీర్‌లో యాబై సినిమాల్లో న‌టించి మెప్పించిన కాజ‌ల్‌కు క్వీన్ సినిమా రావ‌డం మ‌రింత గుర్తింపు తెస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమాను నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. అల్రెడీ క‌న్న‌డ క్వీన్ రీమేక్ స్టార్ట్ అయ్యింది. కన్న‌డంలో క్వీన్‌గా పారుల్ యాద‌వ్ న‌టిస్తుంది. త‌మిళ వెర్ష‌న్‌ను రేవ‌తి డైరెక్ట్ చేస్తుండ‌గా సుహాసిని మాట‌ల‌ను అందిస్తున్నారు.