కణం శాటిలైట్ రైట్స్ డీల్ పూర్తి

Published On: February 14, 2018   |   Posted By:

కణం శాటిలైట్ రైట్స్ డీల్ పూర్తి

నాగశౌర్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన కణం సినిమా శాటిలైట్ డీల్ పూర్తిచేసుకుంది. ఈనెల 23న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ 3 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. నిజానికి ఈ సినిమా ఇంత మొత్తం వస్తుందని మేకర్స్ ఊహించలేదు. ఫిదా కారణంగా సాయి పల్లవికి అప్పటికే క్రేజ్ ఉన్నప్పటికీ, నాగశౌర్య మాత్రం వరుసగా ఫ్లాపులతో ఉన్నాడు. సరిగ్గా కణం రిలీజ్ టైమ్ కు నాగశౌర్య నటించిన ఛలో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. కణం సినిమాకు కలిసొచ్చింది. అందుకే కోటి దగ్గరే ఆగిపోతుందనుకున్న ఈ సినిమాకు ఏకంగా 3 కోట్ల రూపాయల శాటిలైట్ డీల్ సెట్ అయింది.

అంతేకాదు.. ఛలో సక్సస్ తో కణంకు థియేట్రికల్ బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది. లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.