కథానాయకులు చిత్రం నవంబర్ విడుదల

Published On: October 29, 2018   |   Posted By:

కథానాయకులు చిత్రం నవంబర్ విడుదల

స్టార్ హీరోల డూపులతో కథానాయకులు సాయి తులసి సమర్పణలో సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై భాస్కర్ , శివ , చందు , శృతి హీరో హీరోయిన్లుగా సి.రామాంజనేయ నిర్మాతగా హబీబ్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎంటర్ టైన్మెంట్ చిత్రం కథానాయకులు ఈ చిత్రం నవంబర్ 2 న విడుదలవుతుంది. దర్శకుడు హబీబ్ మాట్లాడుతూ… బాలకృష్ణ , నాగర్జున , వెంకటేష్ డూపులు భాస్కర్ , శివ , చందు హీరోలుగా నటించారు. ఫస్ట్ ఆఫ్ అంత ఎంటర్ టైన్మెంట్ గా కొనసాగుతుంది , సెకండ్ ఆఫ్ సస్పెన్స్ తో చంపేదెవడురా.. చచ్చేదెవడురా… అని అందరిని థ్రిల్ కు గురిచేస్తుంది , ఒక మల్టీ స్టార్స్ సినిమా చూస్తున్న ఫిల్లింగ్ కలుగుతుంది, మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారన్నారు.
నిర్మాత సి.రామాంజనేయ మాట్లాడుతూ… స్టార్ హీరోల డూపులతో కథానాయకులు లాంటి మంచి సినిమా నిర్మిచినందుకు చాలా సంతోషంగా ఉంది , నవంబర్ 2 న విడుదల చేస్తున్నాం ,
పెద్ద హీరో అభిమానులు ఎక్కడ ఫిల్ అవ్వకుండా ఇలాంటి చిత్రాన్ని నిర్మించటానికి కావలిసిన జాగర్తలన్నీ తీసుకొన్నాము , అన్నివర్గాల ప్రేక్షకులు నచ్చుతుందన్నారు . ఇంకా ఈ చిత్రంలో రాఘవ , రెహమాన్ , జానీ , వి స్ ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : జో అండ్ శివ , సంగీతం : ఫెసిలియాన్ స్టూడియోస్ ,కో డైరెక్టర్స్ : మింటు సోహెల్ ,దినేష్ ఊటుకూరు , కథ ,మాటలు ,నిర్మాత : సి.రామాంజనేయ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : హబీబ్