కబ్జా చిత్రం సంక్రాంతి పోస్టర్ విడుదల

Published On: January 14, 2021   |   Posted By:

కబ్జా చిత్రం సంక్రాంతి పోస్టర్ విడుదల

‘కన్నడ’ సూపర్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ అనే పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించినట్టు తెలిసిన విషయమే. ఇది మన దేశంలోనే 7 వివిధ భాషల్లో విడుదల కాబోతుంది.

ఈ చిత్రానికి ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఉపేంద్ర – చంద్రు కాంబినేషన్లో కన్నడంలో బ్రహ్మ మరియు ఐ లవ్ యూ అనే సినిమాలు వచ్చాయి. తెలుగు లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే సినిమా సుధీర్ బాబు తో కూడా దర్శకత్వం వహించారు. ఈ కబ్జా అనే సినిమా ఉపేంద్ర – చంద్రు కాంబినేషన్లో మూడవ చిత్రం. 
 
సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రకటన ఉంది అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ లో, ‘U + ?’ అని రాసి, ఎవరు జాయిన్ కాబోతున్నారో కనుగొనండి అని ఉంది. అందులో ఉన్న ‘U’, చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా, సినిమాలో కథానాయిక అనుకుంటూ ఆ తరువాత మల్టీస్టారర్ చిత్రాల పోస్టర్లు కలగలిపిన పోష్టర్ల్ వదిలారు. 
 
వీటి అన్నిటికి తెర తీస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ ‘?’ అనేది ‘కన్నడ’ బాద్షా కిచ్చా సుదీప్ యొక్క లుక్ ని వదిలారు. అందులో ‘భార్గవ్ భక్షి’ 1947-1986 అని ఉండగా. ఆ పాత్ర సుదీప్ పోషించబోతున్నారు అని కనిపిస్తుంది. మాఫియా ను అంతం చేసే ఒక పాత్ర అని పోస్టర్ మీద రాసి ఇంకాస్త ఆసక్తిని పెంచారు చిత్ర టీమ్.
 
ఇంతకు ముందే ఉపేంద్ర- సుదీప్ కాంబినేషన్లో ‘ఓ మై గాడ్’ హిందీ సినిమా యొక్క కన్నడ రీమేక్ చేశారు. అయితే, ఇది దానికి పూర్తి వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తుంది పోస్టర్లు చూస్తేనే. ఇక ఉపేంద్ర – సుదీప్ కాంబినేషన్లో మరొక్కసారి రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ ఎలా ఉండబోతోందో, రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
 
ఆర్ట్ : శివ్ కుమార్
 
ఎడిటర్ : మహేష్ రెడ్డి
 
సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి
 
మ్యూజిక్ : రవి. బస్రూర్ 
 
సమర్పణ : లాంకో శ్రీధర్
 
నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్
 
నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా
 
రచన – దర్శకత్వం : ఆర్. చంద్రు