కర్తవ్యం సినిమా   ట్రయిలర్ రివ్యూ

Published On: March 13, 2018   |   Posted By:

కర్తవ్యం సినిమా   ట్రయిలర్ రివ్యూ

కోలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన ఆరమ్ సినిమా కర్తవ్యం పేరిట తెలుగులో విడుదలకు సిద్ధమైంది. మార్చి 16న థియేటర్లలో రానున్న ఈ సినిమాను తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ సమర్పిస్తున్నారు. నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా తెలుగు ట్రయిలర్ విడుదల చేశారు. అదెలా ఉందో చూద్దాం.
బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథ ఇది. బావి నుంచి చిన్నారిని బయటకు తీసే స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ గా నయనతార ఆ గ్రామానికి వెళ్తుంది. ఆ క్రమంలో అక్కడున్న బడా నేతలతో సంఘర్షణ ఎదురవుతుంది. కొందరి భూములు ఆక్రమించుకోవాల్సి వస్తుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారితో మొదలైన కథ, ఏ మలుపు తిరిగింది.. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పటికీ కలెక్టర్ గా నయనతార తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
ట్రయిలర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా నయనతార యాక్టింగ్ చాలా బాగుంది. దర్శకుడు గోపీ నయనార్ విజన్ కు సినిమాటోగ్రాఫర్ ఓంప్రకాష్ పూర్తి న్యాయం చేశారు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.