కళ్లముందే అర్జున్ రెడ్డి 3 మిలియన్లు కొట్టాడు

Published On: August 7, 2017   |   Posted By:
కళ్లముందే అర్జున్ రెడ్డి 3 మిలియన్లు కొట్టాడు

అర్జున్ రెడ్డి థియేట్రికల్ ట్రయిలర్ ఎంత బాగుందో మనందరం చూశాం. విజయ్ దేవరకొండ మేనరిజమ్, డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణగా విడుదలైన అర్జున్ రెడ్డి ట్రయిలర్.. సోషల్ మీడియాను ఓ మోత మోగిస్తోంది. విడుదలైన కొన్ని గంటలకే ఈ సినిమా ఏకంగా 30లక్షల వ్యూస్ సాధించిందంటే ఈ సినిమా క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.
యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు అన్నింటింలో కలుపుకొని 3 మిలియన్ వ్యూస్ సాధించింది అర్జున్ రెడ్డి ట్రయిలర్. సందీప్ వంగ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై టీజర్ విడుదలైనప్పటి నుంచి  భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. తాజాగా విడుదలైన ట్రయిలర్.. అర్జున్ రెడ్డి సినిమాను ఆకాశంలో కూర్చోబెట్టింది.
రదన్ సంగీతం అందించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలిని హీరోయిన్ గా నటించింది. ఈనెల 25న అర్జున్ రెడ్డి థియేటర్లలోకి వస్తున్నాడు.