కార్తిక్ రాజు దర్శకత్వంలో కొత్త చిత్రం

Published On: September 24, 2019   |   Posted By:

కార్తిక్ రాజు దర్శకత్వంలో కొత్త చిత్రం

తెలుగు – తమిళ భాషల్లో కార్తిక్ రాజు దర్శకత్వంలో కథిరేసన్ కొత్త చిత్రం

స్టార్ ప్రొడ్యూసర్ కధిరేసన్ నేషనల్ అవార్డ్ దక్కించుకున్న సూపర్ హిట్స్ ఆడుకాలం, జిగర్తాండ చిత్రాలు నిర్మించారు.

ఆయన తమిళ్ లో నిర్మించిన జిగర్తాండ, ‘గద్దలకొండ గణేష్’ గా తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది.

తెలుగు – తమిళ భాషల్లో కథిరేసన్ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల సందీప్ కిషన్ హీరోగా నిను వీడని నీడను నేనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తిక్ రాజు దర్శకత్వం వహించనున్నారు.

ఒక ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు.