కాలా టీజ‌ర్ విడుద‌ల డేట్‌

Published On: February 21, 2018   |   Posted By:

కాలా టీజ‌ర్ విడుద‌ల డేట్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కాలా`. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ర‌జనీకాంత్‌తో `క‌బాలి` సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం.  ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు. కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను మార్చి 10న విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ముంభై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.