కాలా సెకండ్ లుక్‌

Published On: December 12, 2017   |   Posted By:

కాలా సెకండ్ లుక్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కాలా`. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ర‌జనీకాంత్‌తో `క‌బాలి` సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాను వ‌చ్చే వేస‌వికి విడుద‌ల చేయాల‌నేది నిర్మాత‌ల ఆలోచ‌న‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హీరో ధ‌నుష్‌..`కాలా` సినిమా సెకండ్ లుక్‌ను ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు(డిసెంబ‌ర్ 12) సంద‌ర్భంగా విడుద‌ల చేసి అభిమానుల‌కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.