కిరాక్ పార్టీ ట్రయిలర్ రివ్యూ

Published On: March 14, 2018   |   Posted By:

కిరాక్ పార్టీ ట్రయిలర్ రివ్యూ


హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ లీడ్ రోల్ చేశాడు. నలుగురు హీరోల్లో ఒకడిగా కనిపిస్తాడు. మూవీలో కాస్త యాక్టివ్ గా కనిపించే క్యారెక్టర్ కూడా ఇదే. సో.. ఇలాంటి హీరోకు కిరాక్ పార్టీ లాంటి సబ్జెక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది. తాజాగా రిలీజ్ అయిన కిరాక్ పార్టీ ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. కాలేజ్ స్టూడెంట్ పాత్రలో లీనమైపోయాడు నిఖిల్.

సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు రిలీజైన కిరాక్ పార్టీ ట్రయిలర్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. విజువల్స్, డైలాగ్స్, ఎమోషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతి యాంగిల్ లో ఈ ట్రయిలర్ యూత్ కు కనెక్ట్ అయింది. ఇవన్నీ ఒకెత్తయితే.. కాలేజ్ స్టూడెంట్ గా నిఖిల్ లుక్స్ మరో ఎత్తు. కేశవ సినిమాలో అంత సీరియస్ గా కనిపించిన హీరోయేనా, ఇప్పుడింత జోష్ తో కనిపిస్తున్నాడు అనిపించక మానదు.

ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కిరాక్ పార్టీ తెరకెక్కింది. దీంతో పాటు హీరోలో డిఫెరెంట్ షేడ్స్ ను పరిచయం చేసేలా సినిమా ఉండబోతోంది. ఓవరాల్ గా కిరాక్ పార్టీ థియేట్రికల్ ట్రయిలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాల్ని డబుల్ చేసింది. నిఖిల్ లుక్స్, సిమ్రాన్ స్మైల్, అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది కిరాక్ పార్టీ సినిమా.