కిరాక్ పార్టీ 3 రోజల వసూళ్లు

Published On: March 19, 2018   |   Posted By:
కిరాక్ పార్టీ 3 రోజల వసూళ్లు
విడుదలైన 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది కిరాక్ పార్టీ.  ఈ 3 రోజుల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు షేర్ 5 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 18 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది కిరాక్ పార్టీ. ఇక ఈ సినిమాకు శనివారం నాటికి 2 రోజుల్లో 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇది కూడా ఓ రికార్డే. తాజాగా ఆదివారం తో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 15 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. షేర్ పరంగా చూస్తే ఈ సినిమాకు 5 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు ఇప్పటికే 3 కోట్ల 25 లక్షల రూపాయల శాటిలైట్ రైట్స్ ధర పలికింది. జెమినీ టీవీ ఈ రైట్స్ దక్కించుకుంది. అటు హిందీ శాటిలైట్ రైట్స్ రూపంలో కోటి రూపాయలొచ్చాయి. ఇక ఆడియో, డీవీడీ, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కింద మరో 50 లక్షలొచ్చాయి. ఇవన్నీ కలుపుకుంటే.. విడుదలైన ఈ 3 రోజుల్లోనే కిరాక్ పార్టీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది.