కీర్తి సురేష్ మూడోసారి…

Published On: August 26, 2017   |   Posted By:
కీర్తి సురేష్ మూడోసారి…
మల‌యాళ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది. తెలుగులో నేను శైల‌జ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థపై రూపొందుతున్న చిత్రంలో సావిత్రి పాత్ర‌లో న‌టిస్తుంది.
ఈ రెండు సినిమాలు  తెలుగులో త‌న‌ను స్టార్ హీరోయిన్ చేస్తుంద‌ని కీర్తిసురేష్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. పైన పెర్కొన్న సినిమాలు కాకుండా తెలుగులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన అనువాద చిత్రాలు భైర‌వ‌, రెమో చిత్రాలు కూడా విడుద‌ల‌య్యాయి. ఈ చిత్రాల్లో ఓ విష‌యం  రిపీట్ అవుతుంది. అదేంటంటే రెమో సినిమా గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైతే, ఈ ఏడాది సంక్రాంతికి భైర‌వ విడుద‌లైంది. వ‌చ్చే ఏడాది ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా విడుద‌ల‌కానుంది. సినిమాలు ఏదైనా సంక్రాంతి సెంటిమెంట్‌ను మాత్రం కీర్తి ఫాలో అవుతుంది మ‌రి…