కృష్ణార్జున యుద్ధం మూవీ ఉరిమే మనసే సాంగ్ రివ్యూ

Published On: March 17, 2018   |   Posted By:

కృష్ణార్జున యుద్ధం మూవీ ఉరిమే మనసే సాంగ్ రివ్యూ

 

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు సాంగ్స్ రిలీజ్ కాగా.. తాజాగా ఉరిమే మనసే అనే లిరిక్స్ తో సాగే మరో పాటను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ కు భిన్నంగా ఉంది ఈ పాట.
పాట సాహిత్యం చూస్తే ఇది విరహ గీతమే. అలా అని డల్ గా సాగే బీట్ కాదు. కంప్లీట్ వెస్ట్రన్ బీట్ లో కంపోజ్ చేశారు. అందుకే ఈ పాటకు ఆ ప్రత్యేకత వచ్చింది. శ్రీజో ఈ పాట రాయగా.. రఘు దీక్షిత్ ఆలపించాడు. హిపాప్ తమీజా కంపోజ్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి లిరికల్ వీడియోస్ లో భాగంగా ఇదే ఆఖరి పాట కావొచ్చు. త్వరలోనే జూక్ బాక్సా మొత్తాన్ని విడుదల చేయబోతున్నారు.
నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలోకి వస్తోంది.