కేథ‌రిన్ ట్రెసా సెకండ్ హీరోయిన్‌నా.. స్పెష‌ల్ సాంగ్‌లోనా

Published On: August 7, 2017   |   Posted By:
కేథ‌రిన్ ట్రెసా సెకండ్ హీరోయిన్‌నా.. స్పెష‌ల్ సాంగ్‌లోనా
స‌రైనోడుతో స‌రైన విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది కేథ‌రిన్ ట్రెసా. ఆ చిత్రంలో చేసిన ఎం.ఎల్‌.ఎ పాత్ర‌తో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇటీవ‌లే విడుద‌లైన గౌత‌మ్‌నంద అమ్మ‌డికి ఆశించిన విజ‌యం ఇవ్వ‌క‌పోవ‌డంతో.. రానున్న త‌న రెండు చిత్రాల‌పై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది కేథ‌రిన్‌. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు ఒకే రోజు విడుద‌ల కానుండ‌డం. వీటిలో ఒక చిత్రంలో రెండో హీరోయిన్ పాత్ర‌లో న‌టిస్తే.. మ‌రో చిత్రంలో ఐటం సాంగ్‌లో న‌ర్తించింది. ఇంత‌కీ ఆ చిత్రాలేమిటంటే.. రానా హీరోగా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన జ‌య‌జాన‌కి నాయ‌క‌. ఈ రెండు చిత్రాలు ఈ నెల 11న విడుద‌ల కానున్నాయి. మ‌రి ఈ రెండు చిత్రాల‌లో కేథ‌రిన్ కి ద‌క్కే విజ‌యం సెకండ్ హీరోయిన్ గానా.. లేక స్పెష‌ల్ సాంగ్‌లోనా అన్న‌ది త్వ‌ర‌లోనే తెలుస్తుంద‌న్న‌మాట‌.