కేమియో సిద్ధ‌ప‌డ్డ స్టార్ డైర‌క్ట‌ర్‌ గౌత‌మ్‌ వాసుదేవ‌ మీన‌న్

Published On: October 21, 2017   |   Posted By:
కేమియో సిద్ధ‌ప‌డ్డ స్టార్ డైర‌క్ట‌ర్‌ గౌత‌మ్‌వాసుదేవ‌మీన‌న్
Image result for gautham menon
కొంత‌మంది ద‌ర్శ‌కులకు భాషా భేదాలు ఉండ‌వు. వాళ్ల సినిమాలు భాష‌ల స‌రిహ‌ద్దుల్ని చెరిపేసి హృద‌యాల‌ను కొల్ల‌గొడుతుంటాయి. అలాంటివారిలో ఈ త‌రంలో గౌత‌మ్‌వాసుదేవ‌మీన‌న్ ఒక‌రు. ఆయ‌న త‌మిళంలో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారన‌గానే త‌మిళ తంబిల క‌న్నా ముందు ఆయ‌న సినిమా కోసం తెలుగువారు కూడా ఎదురుచూస్తుంటారు. అలాంటి స్టార్ డైర‌క్ట‌ర్ ఇప్పుడు కెమెరా ముందు అప్పియ‌ర్ కానున్నారు. గోలీసోడా2లో ఆయ‌న న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. ఇందులో చాలా కీల‌క పాత్ర‌లో గౌత‌మ్ క‌నిపిస్తార‌ని స‌మాచారం. 2014లో విడుద‌లైన `గోలీసోడా` సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమాకు ముందు కూడా అడ‌పాద‌డ‌పా రెప్ప‌పాటులో మాయ‌మ‌య్యే ప‌లు పాత్ర‌ల్లో గౌత‌మ్ క‌నిపించారు. కానీ కాస్త లెంగ్త్ ఉన్న పాత్ర మాత్రం ఆయ‌న‌కు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.