కేరళకు సైరా

Published On: January 11, 2018   |   Posted By:
కేరళకు సైరా
చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవల ఈ సినిమా హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కేరళలో చిత్రీకరించబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరు సరసన నయనతార నటిస్తుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి యోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందుతుంది. సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.