కేరాఫ్ సూర్య టీజర్ రివ్యూ

Published On: September 26, 2017   |   Posted By:

కేరాఫ్ సూర్య టీజర్ రివ్యూ


సందీప్ కిషన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కేరాఫ్ సూర్య. నిర్మాత చక్రి చిగురుపాటి పుట్టినరోజు సందర్భంగా, నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? మూవీపై అంచనాలు పెంచిందా? టీజర్ లో ప్లస్ లేంటి? చూద్దాం

ఏ సినిమాకైనా హీరో క్యారెక్టరైజేషన్ ప్రాణం. అది క్లిక్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. అందుకే దర్శకులంతా హీరో పాత్రలపై ప్రత్యేకంగా దృష్టిపెడతారు. కేరాఫ్ సూర్య సినిమాలో కూడా అదే ప్రయత్నం జరిగింది. టీజర్ ను కేవలం హీరో ఇంట్రడక్షన్ కు మాత్రమే ఉపయోగించారు. కాకపోతే హీరో పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో అతడి కుటుంబం, స్నేహితుల్ని పరిచయం చేసిన విధానం బాగుంది.

హీరో ఆవారా అని స్ట్రయిట్ గా చెప్పకుండా తనదైన స్టయిల్ లో నెరేట్ చేశాడు దర్శకుడు సుశీంద్రన్. చిన్న పిల్లల్ని ఏడిపించే దగ్గర్నుంచి ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటాడనే విషయాన్ని చూపించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్ లో సందీప్ కిషన్ చక్కగా ఒదిగిపోయాడు. అతడికో కుటుంబం, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయాన్ని టీజర్ లో చూపించారు.

ఇక హీరోయిన్ మెహ్రీన్ ను కూడా మోడ్రన్ గా, అందంగా చూపించారు. ఇంటికొచ్చి కొడతా అంటూ హీరోయిన్ హీరోకు వార్నింగ్ ఇవ్వడం టోటల్ టీజర్ కే హైలట్ అని చెప్పొచ్చు. డి.ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మంచి ఊపు తీసుకొచ్చింది. ఓవరాల్ గా కేరాఫ్ సూర్య టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఉంది.