కొత్త అవ‌తారంలో ఆదాశర్మ‌

Published On: September 20, 2017   |   Posted By:

కొత్త అవ‌తారంలో ఆదాశర్మ‌

హీరోయిన్ ఆదాశ‌ర్మ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. హార్ట్ ఏటాక్ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న జోడి క‌ట్టింది. ఈ సొగ‌స‌రికి ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇప్ప‌డు ఆదాశ‌ర్మ‌కు బుల్లితెర నుండి వ‌చ్చిన అవ‌కాశం ఆమెను ఆనందంతో ముచ్చెత్తింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ టీవీ ఛానెలో స్టార్ మా ఓ డ్యాన్స్ షోను ప్లాన్ చేస్తుంది. ఈ షోలో జడ్జిగా చేయాల్సిందిగా ఆదాశ‌ర్మ‌ను కోరింద‌ట‌. ఆదాశ‌ర్మ కూడా స‌రేన‌ని చెప్పేసిందట‌. ఈ డ్యాన్స్ షోలో మ‌రో జ‌డ్జిగా రేణుదేశాయ్ చేస్తుండ‌టం విశేషం.

ప్ర‌స్తుతం స్టార్ మా వారు నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ నెల 24న బిగ్ బాస్ షో ముగియ‌నుంది. వెంట‌నే ఈ షోకు రెండవ సీజ‌న్ స్టార్ట్ చేయ‌కుండా కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. అయితే స్టార్ ప్ల‌స్‌లో వ‌చ్చే నాచ్ బ‌లియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టైల్లో స్టార్ మా టీవీ ఓ డ్యాన్స్ షోను ప్లాన్ చేసి తెర‌పైకి ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ షోకు ఉద‌య‌భాను యాంక‌ర్‌గా ప‌నిచేయ‌నుంది.