కొత్త ఏడాదిలో మహేష్ సినిమా ఫస్ట్ లుక్

Published On: December 6, 2017   |   Posted By:
కొత్త ఏడాదిలో మహేష్ సినిమా ఫస్ట్ లుక్
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీకి సంబంధించి నూతన సంవత్సరంలో హంగామా చేయబోతున్నారు. భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను ఈనెల 31న లేదా జనవరి 1న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు యూనిట్ తో చర్చలు జరుపుతున్నాడు దర్శకుడు కొరటాల శివ.
భరత్ అనే నేను సినిమా షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతోంది. త్వరలోనే తమిళనాడులో మరో షెడ్యూల్ మొదలవుతుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ రోజునే సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ రానుంది.  ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్టు మొదట ప్రకటించారు. కానీ అదే తేదీకి బన్నీ, రజనీకాంత్ సినిమాలు కూడా వస్తున్నాయి. దీంతో మరో తేదీపై చర్చలు జరుపుతున్నారు మేకర్స్.