కొత్త చిత్రాల్లో రాశి ఖ‌న్నా పాత్రల పేర్లు

Published On: January 17, 2018   |   Posted By:

కొత్త చిత్రాల్లో రాశి ఖ‌న్నా పాత్రల పేర్లు

రాశి ఖ‌న్నా.. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లోనూ సంద‌డి చేస్తోన్న ఉత్త‌రాది భామ‌. గతేడాది జై ల‌వ కుశ‌తో విజ‌యాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్థంలో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ర‌వితేజ‌తో న‌టించిన ట‌చ్ చేసి చూడు ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల కానుండ‌గా.. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ఆడిపాడిన తొలి ప్రేమ ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ గ్లామ‌ర్‌, పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో రాశి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ రాశి పాత్ర‌ల పేర్లు బ‌య‌ట‌కొచ్చాయి. అవి కూడా ఇటీవ‌ల విడుద‌లైన ఆయా చిత్రాల్లోని పాట‌ల ద్వారా తెలియ‌డం విశేషం. ట‌చ్ చేసి చూడులో పుష్ప అనే పాత్ర‌లో రాశి సంద‌డి చేయ‌నుండ‌గా.. తొలి ప్రేమ చిత్రంలో వ‌ర్ష అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ రెండు చిత్రాల విజ‌యాల‌తో త‌న‌కి మ‌రింత గుర్తింపు ల‌భిస్తుంద‌న్న ధీమాతో ఉంది రాశి.