కొత్త లుక్ కోసం ఎన్టీఆర్  కసరత్తులు

Published On: January 13, 2018   |   Posted By:
కొత్త లుక్ కోసం ఎన్టీఆర్  కసరత్తులు
యువ కథానాయకుడు ఎన్టీఆర్…2017లో ‘జై లవకుశ’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఆల్‌రెడీ ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తారక్ ఓ కొత్త లుక్ కనపడబోతున్నారట. అందుకోసమని రోజులో ఎక్కువ భాగం జిమ్‌లో గడుపుతున్నారు. అలాగే డైట్ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నారట. జిమ్, డైట్ కారణాలతో ఎన్టీఆర్ వెయిట్ తగ్గి స్లిమ్‌గా కనపడుతున్నారట. అయితే తన లుక్ బయటపడకూడదని ఎక్కువగా బయటకు రావడం లేదట ఎన్టీఆర్. ఈసినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.