కొత్త సినిమా కోసం అమెరికాకు అల్లు అర్జున్

Published On: July 26, 2017   |   Posted By:

కొత్త సినిమా కోసం అమెరికాకు అల్లు అర్జున్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే అమెరికా వెళ్లబోతున్నాడు. ఈసారి అమెరికా వెళ్లేది విహార యాత్ర కోసం కాదు. తన కొత్త సినిమా పనిమీద యూఎస్ వెళ్తున్నాడు బన్నీ. వక్కంతం వంశీ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కు పర్ ఫెక్ట్ ఫిజిక్ అవసరం. అందుకే ప్రత్యేకమైన కసరత్తులు చేసేందుకు అమెరికా వెళ్తున్నాడు అల్లు అర్జున్.

నిజానికి బన్నీది ఎక్సర్ సైజ్ బాడీనే. కానీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకు మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఫారిన్ ట్రయినర్ పర్యవేక్షణలో మరింత దిట్టమైన ఫిజిక్ ను సంపాదించేందుకు సిద్ధమౌతున్నాడు. కఠినమైన ఆహార నియమాలు పాటించబోతున్నాడు.

త్వరలోనే  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్ము రాష్ట్రాల్లో ఈ సినిమా షూటింగ్  ఉంటుంది. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా సెలక్ట్ అయిన ఈ సినిమాలో సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు