కొబ్బ‌రిమ‌ట్ట‌ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌

Published On: August 9, 2019   |   Posted By:
 
కొబ్బ‌రిమ‌ట్ట‌ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌
 
 
బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో `హృద‌య‌కాలేయం` సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కొబ్బ‌రిమ‌ట్ట‌`. ఆగ‌స్ట్ 10న సినిమా రిలీజ్ అవుతుంది.
 
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…
 
 
కుడు మారుతి మాట్లాడుతూ – ” ఒక వ్యక్తికి సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉంటుందో అనేది సాయి రాజేష్ ని చూసి తెలుసుకోవచ్చు. ఎలాగైతే మట్టి నుండి తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని మనం పూజిస్తామో .. అలా మట్టిలో నుండి సంపూ ని తెచ్చి ఒక స్టార్ ని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇన్ని పేజీల డైలాగ్ ని రాసి దాన్ని స్క్రీన్ మీద సింగల్ టేక్ లో ఎలాంటి భయం లేకుండా కాన్ఫిడెంట్ గా చెప్పడం నిజంగా అద్భుతం.  సంపూ ఎంత పెద్ద నటుడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ సినిమా తనుజెన్యూన్ గా ఎంతవరకూ యాక్టింగ్ చేయగలడనితన స్కిల్ కి పరీక్ష.  ప్రతి క్షణం ఎలాగోలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే తపన కనపడింది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీం” అన్నారు.
 
 
 
నటుడు సమీర్ మాట్లాడుతూ – ” వాళ్ళు రాసింది సంపూ చేస్తాడు అని ఇంతలా నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన రాజేష్ గారికి హాట్స్ ఆఫ్. ట్రైలర్ చాలా బాగుంది.  సినిమా తప్పకుండా గన్ షాట్  బ్లాక్ బస్టర్  అవుతుంది” అన్నారు.
 
 
 
నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ – ” ఈ మూవీ స్టార్టింగ్ నుండి ట్రావెల్ అవుతున్నాం. ఎంతో కష్టమైన ఈ సినిమాను చాలా ఇష్టపడి నిర్మించారు. సంపూ ని స్టార్టింగ్ నుండి ఎంకరేజ్ చేస్తూ సాయి రాజేష్ ఇంతవరకూ తీసుకువచ్చాడు. ఈ టీం ఇలాగే మంచి సినిమాలను మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
 
 
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ – “సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం. కొబ్బరి మట్ట టీజర్, ట్రైలర్ చూశాను. మల్లి మల్లి చూడాలనిపించే కంటెంట్ అనిపించింది. మార్నింగ్ 8 :45 షో కి టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ సినిమా విజయం విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.
 
 
 
నటి షకీలా మాట్లాడుతూ – ” అందరికి నమస్కారం. ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి థ్యాంక్స్” అన్నారు.
 
 
డైరెక్ట‌ర్ రూప‌క్ రొనాల్డ్ మాట్లాడుతూ – “ఈ సినిమాను అంద‌రూ ఎంత ప్రేమిస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. డైరెక్ష‌న్ టీమ్‌కి థ్యాంక్స్‌. మూడు కాలాల‌కు సంబంధించిన సంగీతాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. సాయిరాజేశ్‌గారు ఈ సినిమాను నిర్మాత‌గానే కాదు.. నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. జంధ్యాల‌గారు, ఈవీవీగారి కామెడీ బాగా న‌చ్చుతుంది. వారి త‌ర్వాత సాయిరాజేశ్ కామెడీ నాకు న‌చ్చుతుంది. రాజేశ్‌గారితో పాటు సంపూగారి కార‌ణంగానే ఈ సినిమాను చేశాను. నాకు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు సాయిరాజేశ్‌గారు. చాలా ఒడిదొడుకులు చూసిన త‌ర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాం“ అన్నారు. 
 
 
సాయి రాజేశ్ మాట్లాడుతూ – “ప్ర‌తి సినిమాకు డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్‌, హీరో సినిమా కోసం చ‌చ్చిపోయేంత త‌పిస్తుంటారు కాబ‌ట్టే వారికి పేరు వ‌స్తుంటుంది. నేను, సంపూ, రూప‌క్ .. ఐదేళ్లు కొబ్బ‌రిమ‌ట్ట చేశామ‌ని అంటున్నారు కానీ.. షూటింగ్ మేం చేసింది 39 రోజులు మాత్ర‌మే. మ‌రి ఇంత స‌మ‌యం ప‌ట్ట‌డానికి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ప్ర‌తి క్ష‌ణం ఈ సినిమా రిలీజ్ కోసం మేం ముగ్గురం చ‌చ్చిపోయామ‌నే చెప్పాలి. ఈ ఒక సినిమా కోసం ముగ్గురం మా కెరీర్‌ల‌ను వ‌దులుకుని మ‌రీ చేశాం. క‌సి చాలా మందిని డైరెక్ట‌ర్స్‌ను చేస్తుంది. నేను కూడా ప‌న్నెండేళ్ల వ‌య‌సు నుండి డైరెక్ట‌ర్‌ని కావాల‌నుకున్నాను. సందీప్ కిష‌న్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు. 
 
 
సందీప్‌కిష‌న్‌ మాట్లాడుతూ – “సాయిరాజేశ్‌గారు, సంపూర్ణేష్‌గారంటే నాకు చాలా ఇష్టం. నిజాయ‌తీతో సినిమా చేసిన టీమ్ ఇది. నాలుగు సంవ‌త్స‌రాలు క్రితం ఏ టీమ్ అయితే ట్రావెల్ చేసిందో.. అదే టీమ్ ఇప్పుడు కూడా ట్రావెల్ చేసింది. త‌ప్పకుండా సినిమా చూడండి“ అన్నారు. 
 
 
బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ – “మా సినిమా లేట్ కావ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. నా శ్రేయోభిలాషుల్లో చాలా మంది మీ సినిమా రిలీజ్ కాదు.. వేరే సినిమాలు ఒప్పుకో. ఈ సినిమాతో ఎందుకు జ‌ర్నీ చేస్తున్నావ్ అని చెప్పినప్పుడు ఎవ‌రికీ చెప్పుకోలేని బాధ‌. మా ఊరిలోని స్నేహితుల‌కు చెప్పుకున్నాను. ఎక్క‌డో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇక్క‌డ నిల‌బెట్టిన సాయిరాజేశ్‌గారిని న‌మ్ముకోమ‌ని చెప్పారు. డ‌బ్బులున్నా చేయ‌లేక‌, సినిమాలున్నా చేయ‌లేక చాలా ఇబ్బందులు ప‌డ్డాం. కానీ ప్రేక్ష‌కులు మాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఎంతో మంది స‌పోర్ట్ ఇచ్చారు కాబ‌ట్టి ఈరోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాం. కొబ్బ‌రి మ‌ట్ట సినిమాను మీరు ఎంజాయ్ చేయ‌లేక‌పోతే ఇక‌పై నేను సినిమాలు చేయ‌ను. క‌చ్చితంగా సినిమా అందరినీ న‌వ్విస్తుంది. కొబ్బ‌రిమ‌ట్ట సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.