క్య‌లాణ్ రామ్‌తో ఎన్టీఆర్ హీరోయిన్‌

Published On: April 17, 2018   |   Posted By:

క్య‌లాణ్ రామ్‌తో ఎన్టీఆర్ హీరోయిన్‌

ప్ర‌స్తుతం `నా నువ్వే` అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తోన్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ త‌దుప‌రి సినిమాల‌ను లైన‌ప్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గుహ‌న్ తెలుగులో డైరెక్ట్ చేస్తోన్న తొలి సినిమా ఇదే. త‌మిళంలో `ఇనిదు ఇనిదు`( తెలుగులో హ్యాపీడేస్ చిత్రానికి త‌మిళ రీమేక్ ఇది) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్‌తో ఇద్ద‌రు హీరో్యిన్స్ న‌టించ‌నున్నార‌ట‌. వారిలో నివేదా థామ‌స్ ఒక‌రైతే మ‌రొక‌రు షాలిని పాండే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది