క్రికెట‌ర్‌గా న‌టించ‌నున్న హీరోయిన్‌

Published On: May 16, 2018   |   Posted By:

క్రికెట‌ర్‌గా న‌టించ‌నున్న హీరోయిన్‌

యువ  క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ `డియ‌ర్ కామ్రేడ్‌` అనే సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ర‌ష్మిక మండ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక.. ఇప్పుడు నాగార్జున‌, నాని మ‌ల్టీస్టార‌ర్ సినిమాతో పాటు `డియ‌ర్ కామ్రేడ్‌`లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ర‌ష్మిక క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. క్రికెట‌ర్‌గా క‌న‌ప‌డ‌టానికి ర‌ష్మిక హైద‌రాబాద్ క్రికెట్ క్ల‌బ్‌లో ప్ర‌త్యేకంగా క్రికెట్‌ను నేర్చుకుంటుంది.