క్వీన్ సినిమా దర్శకుడు మారాడు

Published On: May 28, 2018   |   Posted By:

క్వీన్ సినిమా దర్శకుడు మారాడు

తమన్న లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ అంతలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కారణం దర్శకుడు నీలకంఠ. అవును.. క్వీన్ సినిమా రీమేక్ నుంచి నీలకంఠ తప్పుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అతడు తప్పుకున్నప్పట్నుంచి క్వీన్ మళ్లీ పట్టాలపైకి రాలేదు. మిగతా సినిమాను కంప్లీట్ చేసే బాధ్యతను ఇప్పుడు మరో దర్శకుడికి అప్పగించారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. దర్శకుడు ప్రశాంత్ వర్మకు క్వీన్ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు “అ!” అనే సినిమా తీశాడు ఈ దర్శకుడు. తొలి సినిమాకే క్లిష్టమైన కథను ఎంచుకొని, అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ దర్శకుడు తన రెండో ప్రాజెక్టుగా క్వీన్ రీమేక్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు. బాలీవుడ్ లో హిట్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. అన్ని భాషల్లో షూటింగ్ సజావుగా సాగుతోంది. తెలుగులో మాత్రం కొన్ని రోజులుగా షూటింగ్ నిలిచిపోయింది.