క్ష‌ణం ద‌ర్శ‌కుడు కూడా రెడీ అవుతున్నాడు

Published On: February 8, 2018   |   Posted By:

క్ష‌ణం ద‌ర్శ‌కుడు కూడా రెడీ అవుతున్నాడు

అడివిశేష్‌, ఆదాశ‌ర్మ‌, అన‌సూయ ప్ర‌ధాన తారాగణంగా ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క్ష‌ణం సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నాడు. `గుంటూరు టాకీస్‌` ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో శీర‌త్ క‌పూర్‌, శ్ర‌ద్ధ శ్రీనాథ్‌, షాలిని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే.. ఈసినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. వేస‌విలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.