క‌మ‌ల్ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌య‌న‌

Published On: January 30, 2018   |   Posted By:

క‌మ‌ల్ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌య‌న‌

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్ర రంగంలో స్టార్ హీరోయిన్‌గా న‌య‌న‌తార రాణిస్తుంది. ఒక్కొక్క సినిమాకు మూడు నుండి నాలుగు కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంది. న‌య‌న‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు కూడా ఆమె పెట్టిన కండీష‌న్స్‌కు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం న‌య‌న‌తార ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మైంద‌ట‌. అది కూడా క‌మ‌ల్‌హాస‌న్‌తో. ఇంత‌కీ ఆ ప్రాజెక్ట్ మ‌రేదో కాదు.. `ఇండియ‌న్ 2`.  క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డానికి రీసెంట్‌గానే న‌య‌న ఎస్ చెప్పింద‌ని టాక్ విన‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.