క‌మ‌ల్ త‌ర్వాత ప్ర‌భుదేవానే

Published On: February 17, 2018   |   Posted By:
క‌మ‌ల్ త‌ర్వాత ప్ర‌భుదేవానే
ప్రభుదేవా… డాన్స్‌ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. పిజ్జా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ప్రభుదేవా నటించిన చిత్రం ‘మెర్క్యురీ’. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో డైలాగ్స్‌ ఉండవట. సైలెంట్‌ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతుంది. అప్పుడెప్పుడో కమల్‌ హాసన్‌, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో విడుదలైన పుష్పక విమానం తర్వాత మరో సైలెంట్‌ మూవీ రాలేదు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు.