క‌ర్ణాట‌క‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి

Published On: December 6, 2017   |   Posted By:
క‌ర్ణాట‌క‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన ‘చమక్’ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం.. ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ కర్ణాటక వెళ్లారు. విజయ్ ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ, “నేను హీరోగా చేసిన తొలి తెలుగు చిత్రం ‘పెళ్లి చూపులు’. వందరోజుల సినిమా. అది చూసి నేను చాలా ఆనంద పడ్డాను. కాని తర్వాత గోల్డెన్ స్టార్ గణేష్ గురించి తెలుసుకుని, నెట్లో ఆయన నటించిన సినిమాలు చూసాను. అందులో ‘ముంగారు మాలే’ (తెలుగులో వ‌చ్చిన వాన‌కి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) 800 రోజులకు పైగా ఒకే థియేటర్లో ఆడటం చూసి ఆశ్చర్యపోయాను” అని గణేష్ పై ప్రసంశలు కురిపించారు. అనంతరం క‌ర్ణాట‌క‌ రాష్ట్రం గురించి మాట్లాడుతూ, “కర్ణాట‌క‌ రాష్ట్రం మన దేశానికి, ప్రపంచానికి చాలా ఇచ్చింది. క్రికెట్  విష‌య‌మే తీసుకుంటే మ‌న దేశం తరపున ఆడిన గ్రేట్‌ ప్లేయర్లు రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, అనిల్ కుంబ్లేలను అందించింది క‌ర్ణాట‌క‌నే. అలాగే రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, అనుష్క వంటి మేటి నటులను ఇండియ‌న్ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కర్ణాటక” అని తెలిపారు. ప్రస్తుతం విజ‌య్  ‘మహానటి’, ‘ఏ మంత్రం వేసావే’ సినిమాలతో బిజీగా ఉన్నారు.