గరుడవేగ క్లోజింగ్ కలెక్షన్లు

Published On: December 14, 2017   |   Posted By:

గరుడవేగ క్లోజింగ్ కలెక్షన్లు

ఎట్టకేలకు గరుడవేగ సినిమాతో హిట్ అందుకున్నాడు హీరో రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తాజాగా 40 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఇదే ఈ సినిమాకు ఫైనల్ రన్ కూడా. దాదాపు ఎ, బి సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు క్లోజ్ అయ్యాయి. ఈ 40 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ సాధించింది గరుడవేగ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ 5కోట్ల 55 లక్షల రూపాయలు.

గరుడవేగ ఫైనల్ కలెక్షన్లు

నైజాం – రూ. 2.40 కోట్లు
సీడెడ్ – రూ. 0.63 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.70 కోట్లు
గుంటూరు – రూ. 0.45 కోట్లు
ఈస్ట్ – రూ. 0.43 కోట్లు
కృష్ణా – రూ. 0.45 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు

మొత్తం షేర్ – రూ. 5.55 కోట్లు