గరుడవేగ 10 రోజుల్లో 22 కోట్లు షేర్

Published On: November 14, 2017   |   Posted By:
గరుడవేగ 10 రోజుల్లో 22 కోట్లు షేర్
రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ సినిమా సూపర్ హిట్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా… తాజాగా 10 రోజుల్లో 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. రాజశేఖర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది గరుడవేగ. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు.
మరోవైపు శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా ఈ సినిమాకు భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లతో చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మధ్య అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఈ డీల్ కూడా ఓకే అయిపోతే నిర్మాతలు లాభాల్లోకి ఎంటర్ అవుతారు. అటు కృష్ణా జిల్లాలో గరుడవేగ సినిమాకు 11 రోజుల్లో 37 లక్షల 78వేల రూపాయల షేర్ వచ్చినట్టు పీఆర్వో ప్రకటించాడు.