గరుడవేగ 3 రోజుల వసూళ్లు

Published On: November 7, 2017   |   Posted By:
గరుడవేగ 3 రోజుల వసూళ్లు
ఎట్టకేలకు హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు హీరో రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సీనియర్ హీరో నటించిన యాక్షన్ థ్రిల్లర్ గరుడవేగ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గడిచిన వారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ.. విడుదలైన 3 రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించింది. మౌత్ టాక్ బాగుండడం, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో గరుడవేగ సినిమాకు ఫస్ట్ వీకెండ్ 2 కోట్ల 43 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఏపీ, నైజాంలో గరుడవేగ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 1 కోటి
సీడెడ్ – రూ. 31 లక్షలు
నెల్లూరు – రూ. 6 లక్షలు
గుంటూరు – రూ. 26 లక్షలు
కృష్ణా – రూ. 19 లక్షలు
వెస్ట్ – రూ. 10 లక్షలు
ఈస్ట్ – రూ. 21 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 30 లక్షలు
మొత్తం – రూ. 2.43 కోట్లు