గరుడవేగ 4 రోజుల కలెక్షన్లు

Published On: November 8, 2017   |   Posted By:
గరుడవేగ 4 రోజుల కలెక్షన్లు
డా.రాజశేఖర్ హీరోగా పూజాకుమార్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా ప్రవీణ్  సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ గరుడవేగ. హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీలియోన్  ఐటెంసాంగ్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సాగిపోతున్న ఈ సినిమాకు మరింత ప్రచారం  కల్పించేందుకు యూనిట్ అంతా ఆంధ్రా టూర్ ప్లాన్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్ని కవర్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఈ సినిమా 4 రోజుల వసూళ్లు వచ్చాయి. వీకెండ్ లో డీసెంట్ వసూళ్లు సాధించిన గరుడవేగ సినిమా విడుదలైన ఈ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 96 లక్షల రూపాయల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 3 కోట్ల 9 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
గరుడవేగ 4 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 1.25 కోట్లు
సీడెడ్ – రూ. 0.36 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.40 కోట్లు
ఈస్ట్ – రూ. 0.23 కోట్లు
వెస్ట్ – రూ. 0.13 కోట్లు
కృష్ణా – రూ. 0.22 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.07 కోట్లు
మొత్తం – రూ. 2.96 కోట్లు