గళం, గాత్రం ఇచ్చారు –  సుమన్

Published On: September 25, 2020   |   Posted By:
గళం, గాత్రం ఇచ్చారు –  సుమన్‌

నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నా కెరీర్‌ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలుగారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలుగారు నాకు పాడారు.
అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. అలాగే శ్రీ రామదాసులోని రామునిగా నటించిన నాకు డబ్బింగ్‌ చెప్పారు.
బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి