గాయత్రి ట్రయిలర్ రివ్యూ

Published On: January 29, 2018   |   Posted By:
గాయత్రి ట్రయిలర్ రివ్యూ

 ఎమోషనల్ కంటెంట్ తో గాయత్రి సినిమా తెరకెక్కుతోందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంత హై-ఎమోషనల్ గా సినిమా ఉండబోతోందనే విషయాన్ని మాత్రం ప్రేక్షకులు ఊహించలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే గాయత్రి ట్రయిలర్ ఆడియన్స్ కు ఓ చిన్నపాటి షాకిచ్చింది.
గాయత్రిలో మరోసారి తన విశ్వరూపం చూపించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ట్రయిలర్ లో అతడు చెప్పే డైలాగ్స్ కే విజిల్స్, చప్పట్లు పడుతున్నాయంటే ఇక థియేటర్లలో మోహన్ బాబును చూసి మైమరిచిపోవాల్సిందే. డైమండ్ రత్నం రాసిన డైలాగ్స్, తుటాల్లా మోహన్ బాబు నోట వస్తుంటే… ట్రయిలర్ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది.
మోహన్ బాబు వన్ మేన్ షో, డైమండ్ రత్నం పెన్ పవర్ ఈ ట్రయిలర్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక యాంకర్ కమ్ నటి అనసూయకు మరోసారి మంచి పాత్ర దొరికిందనే విషయం ట్రయిలర్ లో తెలుస్తోంది. హీరో విష్ణు, హీరోయిన్ శ్రియ కూడా ట్రయిలర్ లో కనిపించారు. కాకపోతే వీళ్ల పాత్రలకు, మోహన్ బాబుకు సంబంధం ఏంటి.. అసలు సినిమా స్టోరీ ఏంటనే విషయంపై ఒక్క క్లారిటీ కూడా ఇవ్వలేదు ట్రయిలర్ లో. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫీ ప్రత్యేక ఆకర్షణ. ఓవరాల్ గా గాయత్రి ట్రయిలర్ సినిమాపై అంచనాల్ని ఎన్నో రెట్లు పెంచేసింది.