గాయ‌త్రి చిత్రంలో విష్ణు పాత్ర

Published On: January 29, 2018   |   Posted By:

గాయ‌త్రి చిత్రంలో విష్ణు పాత్ర

మోహ‌న్‌బాబు ద్విపాత్రాభిన‌యంగా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `గాయ‌త్రి`. ఆయ‌న నిర్మాణంలో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మైంది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో మోహ‌న్‌బాబుతో పాటు విష్ణు, శ్రియలు కూడా కీల‌క పాత్ర‌ధారులుగా క‌న‌ప‌డ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో మోహ‌న్‌బాబు యుక్త వ‌య‌సులోని పాత్ర‌ను విష్ణు చేశాడ‌ట‌. విష్ణు రోల్ పేరు శివాజీ. తండ్రి, కూతురు మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ స్టోరీయే `గాయ‌త్రి` సినిమా అని సినిమా మెయిన్ కాన్సెప్ట్ గురించి  విష్ణు చెప్పాడు