గాయ‌త్రి మూవీ రివ్యూ

Published On: February 9, 2018   |   Posted By:
గాయ‌త్రి మూవీ రివ్యూ
బ్యాన‌ర్‌: ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: మ‌ంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియా శ‌ర‌న్‌, నిఖిలా విమ‌ల్‌, శివ‌ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, నాగినీడు, ఫిష్ వెంక‌ట్‌, పోసాని కృష్ణ ముర‌ళి, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం, స‌త్యం రాజేశ్‌ త‌దిత‌రులు
మ్యూజిక్‌: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
మాట‌లు:  డైమండ్ ర‌త్న‌బాబు
క‌ళ‌: చిన్నా
కూర్పు: ఎం.ఎల్.వర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: ఆర్‌.ఆర్‌.మదన్
మంచు మోహ‌న్‌బాబు విల‌క్ష‌ణ న‌టుడు. అటు విల‌నీ చేయ‌గ‌ల‌రు. ఇటు క‌థానాయ‌కుడిగానూ మెప్పించారు. ఇటీవ‌ల `రౌడీ`తో స‌హా ఆయ‌న న‌టించిన విల‌క్ష‌ణ పాత్ర‌లు ఎన్నెన్నో. సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా, నిర్మాత‌గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఆయ‌న త‌న సొంత సంస్థ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ప‌తాకంపై చాన్నాళ్ల్ త‌ర్వాత తెర‌కెక్కించిన చిత్రం `గాయ‌త్రి`. ఇందులో ఆయ‌న మంచివాడుగానూ, గాయ‌త్రీ ప‌టేల్ అనే విల‌న్‌గానూ న‌టించారు. ఆయ‌న చిన్న‌త‌నంలోని పాత్ర‌లో విష్ణు క‌నిపించారు. ఆస‌క్తిక‌ర‌మైన ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న `గాయ‌త్రి` ఎలా ఉంది?  ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా?  `పెళ్లైన కొత్త‌లో` మ‌ద‌న్‌కి మ‌ళ్లీ `గాయ‌త్రి` మంచి సినిమా అవుతుందా? ఆల‌స్య‌మెందుకు చ‌దివేయండి మ‌రి.
క‌థ‌:
దాస‌రి శివాజి (మోహ‌న్‌బాబు) స్టేజ్ ఆర్టిస్ట్. త‌న భార్య పేరుతో శార‌దా స‌ద‌న్ ని నిర్వ‌హిస్తుంటాడు. పుట్టిన‌ప్పుడే అనాథ ఆశ్ర‌మానికి చేరుకున్న త‌న కూతురుని ఓ వైపు వెతుకుతూ, మ‌రోవైపు పిల్ల‌లు ఎవ‌రూ అనాథ‌లు కాకుండా ఉండ‌టానికి.. త‌న‌కు దొరికిన పిల్ల‌ల‌ను  ఆధార్ కేంద్రాల సాయంతో వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గిస్తుంటాడు. పిల్ల‌ల ఖ‌ర్చుల కోసం మారు వేషాల్లో డ‌బ్బున్న వారికి బ‌దులు జైలు జీవితాన్ని గ‌డుపుతూ ఉంటాడు. ఎదుటివారికి క‌ష్టం వ‌స్తే త‌ట్టుకోలేని మ‌న‌స్త‌త్వం అత‌నిది. ఓ సారి ఓ ప్ర‌మాదంలో ఉన్న వ్య‌క్తి సాయం చేస్తూ త‌న కుమార్తె గాయ‌త్రి (నిఖిలా విమ‌ల్‌)ని క‌లుసుకుంటాడు. మ‌రో సారి ఆమెనే ప్ర‌మాదం నుంచి కాపాడుతాడు. తీరా ఆమెనే త‌న కుమార్తె అని తెలుసుకునే స‌రికి అత‌నికి ఓ మింగుడుప‌డ‌లేని నిజం తెలుస్తుంది. ఇంత‌లోనే క‌థ‌లోకి గాయ‌త్రీ ప‌టేల్ ఎంట‌ర్ అవుతాడు. అత‌ను ఎవ‌రు?   పెళ్లైన కొత్త‌లో శివాజీ (విష్ణు), శార‌ద (శ్రియ‌) జీవితం ఎలా సాగింది? ఇంత‌కీ గాయ‌త్రీ ప‌టేల్‌కి, శివాజీ కుమార్తె గాయ‌త్రికి ఉన్న సంబంధం ఏంటి? అస‌లు క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది? అనేది ఆస‌క్తిక‌రం.
ప్ల‌స్ పాయింట్లు
– శివాజీగా, గాయ‌త్రీ ప‌టేల్‌గా మోహ‌న్‌బాబు న‌ట‌న‌
– విష్ణు, శ్రియ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు
– డైమండ్ ర‌త్న‌బాబు రాసిన డైలాగులు
– క్యారక్ట‌ర్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
– కెమెరాప‌నిత‌నం
– త‌మ‌న్ నేప‌థ్య సంగీతం
– ఫైట్లు
మైన‌స్ పాయింట్లు
– ఆస‌క్తిగా సాగ‌ని తొలి స‌గం
– పంటికింద రాయిలా అనిపించే కొన్ని పాట‌లు
– కామెడీ లేక‌పోవ‌డం
– అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌క‌పోవ‌డం
స‌మీక్ష‌
దాదాపు మూడేళ్ల త‌ర్వాత మేక‌ప్ వేసుకుని మోహ‌న్‌బాబు న‌టించిన సినిమా ఇది. ప‌దేళ్లు వ‌య‌సు త‌గ్గి పాత మోహ‌న్‌బాబుగా అందంగా క‌నిపించారు. సెంటిమెంట్ ప్ర‌ధానమైన స‌న్నివేశాల్లో మెప్పించారు. డైలాగులను త‌న‌దైన విరుపుల‌తో చెప్పి ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టే విష్ణు కూడా ఇందులో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ని క‌న‌బ‌రిచారు. శ్రియ పాత్ర‌ను చూసినంత సేపు ఆమె `మ‌నం`లో చేసిన యాక్టింగ్ గుర్తుకొస్తుంది. ద‌ర్శ‌కుడు తొలి స‌గాన్ని ఇంకాస్త క్రిస్ప్ గా తెర‌కెక్కించి ఉండాల్సింది. శివాజీ ఫ్లాష్‌బ్యాక్‌లో విష్ణు, శ్రియ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అస‌లు క‌థ మొద‌లైన‌ట్టు అనిపిస్తుంది. గాయ‌త్రీప‌టేల్ రాక‌, ఆ పాత్ర చెప్పే డైలాగుల‌తో క‌థ ఊపందుకుంటుంది. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు బావున్నాయి. తండ్రీకూతుళ్ల మ‌ధ్య అనుబంధాన్ని చూపించే క్లైమాక్స్ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. రాజ‌కీయ నాయ‌కుల భాషా ప్రావీణ్యం మీద‌, స్పెష‌ల్ స్టేట‌స్ మీద‌, మ‌రికొన్ని ఇత‌ర అంశాల మీద మోహ‌న్‌బాబు చెప్పే డైలాగుల‌కు క్లాప్స్ ప‌డుతున్నాయి. కొంచెం గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా మోహ‌న్‌బాబు మంచి కాన్సెప్ట్ తో వ‌చ్చారు. `పెళ్లైన కొత్త‌లో` త‌ర్వాత మ‌ద‌న్‌కి చెప్పుకోద‌గ్గ సినిమా అవుతుంది
బాట‌మ్ లైన్‌:  గాయ‌త్రి… షో మేక‌ర్ గాయ‌త్రీప‌టేల్‌!
రేటింగ్‌: 3/5

 

 

Movie title:- Gayatri

Banner:- Sree Lakshmi Prasanna Pictures

Release date:-09.02.2018

Censor Rating:-“U/A”

Cast:- Vishnu Manchu, Shriya,Mohan Babu

Story:-Diamond Ratnababu

Screenplay:-Madan

Dialogues:- Diamond Ratnababu

Directed by:- Madan

Music:- Madan

Lyricists:-Ramajogayya Sastry,Suddala Ashok Teja,Samudrala Senior

Cinematography:- Sarvesh Murari.

Editing:- MR Varma

Producer:- Mohan Babu

Run Time:-125 minutes