గులేబకావళి మూవీ ట్రయిలర్ రివ్యూ

Published On: March 17, 2018   |   Posted By:
గులేబకావళి మూవీ ట్రయిలర్ రివ్యూ

సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ కాన్సెప్ట్ ట్రెజర్ హంట్. నిధి కోసం అన్వేషించే సినిమాలన్నీ దాదాపు కాసులు కురిపించినవే. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి చోట ఇది సక్సెస్ అయింది. అందుకే ప్రభుదేవా కూడా ఈ జానర్ పై ఓ చేయి వేశాడు. కల్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన చిత్రం గులేబగావాళి. ఇదే సినిమా ఇప్పుడు గులేబకావళి పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమైంది. సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు.
గులేబకావళి అనే ఊరిలో నిధి ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న నిధి కోసం చాలా గ్రూపులు చాలా ప్రయత్నిస్తాయి. కానీ ఊరిలో ఉండే వ్యక్తులు, విలన్లు, మంచోళ్లు, పూజారులు.. ఇలా అంతా కలిసి ఊర్లోకి ఎవర్నీ రాకుండా చేస్తారు. నిజానికి నిధి ఎక్కడుందనే విషయం ఊరి జనాలకు కూడా తెలీదు. సరిగ్గా అదే టైమ్ లో నిధి కోసం బయల్దేరుతారు ప్రభుదేవా, హన్సిక. మరి వాళ్లకు నిధి దొరికిందా లేదా అనేది సినిమా స్టోరీ. సీనియర్ నటి రేవతి ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.
సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక కామెడీ, ప్రభుదేవా మార్క్ స్టెప్పులు అదనం. కల్యాణ్ టేకింగ్, వివేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీటర్ హెయిన్స్ యాక్షన్ ట్రయిలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్చి 23న థియేటర్లలోకి రానుంది గులేబకావళి.