గోపీచంద్ సినిమాలో హంసానందిని

Published On: February 21, 2018   |   Posted By:

గోపీచంద్ సినిమాలో హంసానందిని

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమాను ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురానున్నారు. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో సినిమా రూపొంద‌నుంది. చ‌క్రి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా కె.కె.రాధామోహ‌న్ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.  ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో గోపీచంద్ ఎన్నారై యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. మెహ‌రీన్ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా ఈ సినిమాలో హంసా నందిని కూడా కీల‌క పాత్ర పోషించ‌నుంది. హంసా నందిని అంటే స్పెష‌ల్ సాంగ్స్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తున్న త‌రుణంలో త‌న‌కు చాలా మంచి పాత్ర దొరికింద‌ని త‌ప్ప‌కుండా ఈ పాత్ర‌కు త‌న‌కు గుర్తింపు తెస్తుంద‌ని హంసా నందిని సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది.