గ్యాంగ్‌ లీడర్‌ మూవీ రివ్యూ

Published On: September 13, 2019   |   Posted By:

గ్యాంగ్‌ లీడర్‌ మూవీ రివ్యూ

Image result for mythri movie makers gang leader

గ్యాగ్స్ ఓకే..గ్యాంగే వీకు( “గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ)
 Rating: 2.5/5


క్రైమ్ కామెడీలు తెలుగు తెరపై అప్పుడప్పుడూ మెరుస్తున్నాయి. అయితే నాని మాత్రం ఇప్పటిదాకా ఈ జానర్ టచ్ చేయలేదు. దాంతో ఈ సినిమాపై సహజంగానే క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తగినట్లు ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ చేయటం కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మనం, 24 వంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే లు చేసిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం మరికొంతమందిని ఈ సినిమావైపు దృష్టి మరల్చేలా చేసింది. ఈ కాంబినేషన్ లో రెడీ అయిన ఈ సినిమా కథేంటి..నెగిటివ్ రోల్ అయినా కార్తికేయ ఒప్పుకోవటానికి రీజన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్

హాలీవుడ్ క్రైమ్ సినిమాలు చూసి నవలలు రాసే  పెన్సిల్ పార్ధ సారథి (నాని)  దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు వస్తారు. వాళ్లు  ఓ వ్యక్తిని చంపాలని.. దానికి మీ క్రిమినల్ బ్రెయిన్ తో  సాయం చేయాలని కోరతారు. మొదట ఒప్పుకోకపోయినా వాళ్లతో కలిసి పగ తీర్చుకునే క్రమంలో జరిగే సంఘటనలను నవలగా రాసి పెద్ద రైటర్ అయిపోవచ్చు అనే కోరికగా ఓకే అంటాడు. కానీ అతనికు తెలియని విషయం ఏమిటంటే….వాళ్లంతా వెతికేది ఓ కరుడు కట్టిన క్రిమనల్ దేవ్ (కార్తికేయ)కోసం అని. అఫ్ కోర్స్ వాళ్లకి ఈ విషయం తెలియదు. గుర్తు తెలియని ఆ వ్యక్తి కోసం కొన్ని గుర్తులు పెట్టుకుని, ఇన్విస్టిగేషన్ చేస్తూంటాడు. ఈ క్రమంలో  ఆ గ్యాంగ్ తో కలిసి తిరుగుతూ అందులో ఉన్న ప్రియా(ప్రియాంక అరుల్)తో ప్రేమలో పడతాడు. ఈలోగా దేవ్ ఆచూకి తెలుస్తుంది.  అప్పుడు వాళ్లు తమ పగ తీరడానికి ఏం చేస్తారు..ఈ విషయం తెలిసిన దేవ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు. అసలు వాళ్లుదేవ్ మీద పగ పట్టడానికి  గల కారణం ఏమిటి…నాని  సంగతి చివరకు ఏమౌతుంది వంటి విషయాలు   తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.


విశ్లేషణ

కామెడీ కథ ఇలాగే చెప్పాలని రూల్ లేదు కానీ ఇలా చెప్తే బాగుంటుందని ఎప్పుడూ ఓ ఫార్మెట్ ఉంటూనే ఉంటుంది. అయితే ఫార్మెట్ ప్రకారం వెళ్తే పాత వాసన కొడుతుందనిపించవచ్చు. కానీ కొత్తదనం పేరుతో బేసిక్స్ ని వదిలేస్తేనే ఇబ్బంది. గ్యాంగ్ లీడర్ లో అదే జరిగింది. హీరో ఎమోషన్ కు మనం కనెక్ట్ అయితే..ఆ సిట్యువేషన్స్ నుంచి వచ్చే కామెడీని ఎంజాయ్ చేయచ్చు. కానీ హీరోకు ఈ కథలో భుజాన వేసుకున్న పాత్రల ఎమోషన్స్ సైతం ఏమిటో మనకు సినిమా చివరి దాకా తెలియదు. వారేమన్నా గొప్పపని చేస్తున్నారా అంటే బ్యాంక్  దొంగతనం లో వచ్చిన డబ్బు తమకు అందలేదని, వేరే వాడు ఎత్తుకుపోయాడని బాధపడుతూ హీరోని సాయిం అడుగుతారు. అలాంటి వారికి హీరో సాయిం చేయటం అనేది మనకు కాన్సియష్ లో ఓకే అనిపించవచ్చేమో కానీ సబ్ కాన్సియష్ ఏక్సెప్టు చేయదు. అప్పుడే మనకు సినిమాపై గౌరవం పోతుంది. ప్లాట్ గా సాగే ఈ సినిమా ప్లాట్ తో కనెక్ట్ కాము.అదే ఈ సినిమాకు జరిగింది.
 
ఇదే పెద్ద ఇబ్బంది

ఈ రోజుల్లో నవలలే ఎవరూ చదవటం లేదు. ఇంకా నవలా రచయిత గా ఎదగాలని ఎవరు గోల్ పెట్టుకుంటారో అర్దంకాదు. అక్కడే మనం పాత్రతో డీవియేట్ అయ్యిపోతాం.
 
కొరియా కాపీనా

2008లో వచ్చిన కొరియన్ యాక్షన్ కామెడీ Girl Scoutsనుంచి కాపీ కొట్టారని వార్తలు వచ్చాయి. కానీ నిజానికి ఆ సినిమా ధీమ్ తీసుకుని సొంతంగా అల్లుకున్నట్లు ఉంది.  ఎందుకంటే కొరియా సినిమాలోనూ ఓ నలుగురు ఆడవాళ్లు తమను మోసం చేసినవాడిని పట్టుకోవటానికి ఓ గ్యాంగ్ గా ఏర్పడి ఇన్విస్టిగేట్ట చేస్తారు.  అలా ప్లాట్ దాకా సిమిలారిటీస్ ఉన్నాయి కానీ  ఆ సినిమానుంచి సీన్స్ అయితే కాపీ కొట్టలేదు.

టెక్నికల్ గా …
 అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు బాగోలేదు.  ఇక ఎడిటింగ్  విషయానికి వస్తే సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ హైలెట్స్ లో ఒకటి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటుల్లో నాని, లక్ష్మీ టాప్…మిగతా వాళ్లు కూడా బాగా చేసారు. కానీ వీళ్ల ఇద్దరితో పోటీ పడలేదు. సినిమా స్క్రీన్ ప్లేనే మైనస్. డైలాగులు అక్కడక్కడా పేలాయి.
 

చూడచ్చా

అద్బుతం జరుగుతుందని ఎదురుచూడకపోతే…


తెర ముందు..వెనక

నటీనటులు: నాని, కార్తికేయ, ప్రియా అరుళ్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, అనీశ్‌, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రోజెక్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు: వై.నవీన్‌, వై.రవి, మోహన్‌ చెరుకూరి
దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల తేదీ: 13-09-2019