గ్రాండ్ గా 2.0 ఆడియో లాంచ్

Published On: October 28, 2017   |   Posted By:
గ్రాండ్ గా 2.0 ఆడియో లాంచ్
రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 2.0. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఏర్పాటుచేసిన భారీ వేదికపై అంగరంగ వైభవంగా 2.0 సాంగ్స్ విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
ఈ ఒక్క ఈవెంట్ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. రానా, కరణ్ జోహార్, ఏఆర్ బాలాజీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రెహ్మాన్ లైవ్ కాన్సర్ట్ తో పాటు ఎమీ జాక్సన్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెహ్మాన్-శంకర్ ఎంట్రీ, అక్షయ్ కుమార్ ఎంట్రీ ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి.
దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది 2.0 సినిమా. ప్రపంచవ్యాప్తంగా 16 భాషల్లో.. జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.