గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌ (వాల్మీకి)మూవీ రివ్యూ

Published On: September 20, 2019   |   Posted By:

గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌ (వాల్మీకి)మూవీ రివ్యూ

డాన్ వెర్శస్ డైరక్టర్ (గద్దలకొండ గణేష్ రివ్యూ)
 రేటింగ్ : 2.5/5

Image

Image

తమిళంలో వచ్చి హిట్టై, అందులో నటించిన నటుడుకి జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా జిగర్తాండ. ఆ సినిమాని ఆల్రెడీ తెలుగులో చిక్కడు…దొరకడు టైటిల్ తో డబ్బింగ్ చేసి వదిలారు. అప్పుడు జనం పెద్దగా కనెక్ట్ కాలేదు. హీరో సిద్దార్దకు అప్పటికే టైమ్ అయ్యిపోయింది కాటట్టి లైట్ తీసుకున్నారనుకున్నారు…నిజంగా మంచి కథ వేస్ట్ అయ్యిపోయింది అని రీమేక్ రైట్స్ తీసుకుని, తనదైన శైలిలో స్క్రిప్టు తిరగరాసి సినిమా తీసారు. తెలుగు నేటివిటి కోసం చేసిన మార్పులు నప్పాయా…సినిమాని హిట్ మార్గంలోకి తీసుకువెళ్లాయా…అవేంటి, అసలు తెలుగు వారిని వదలని జిగురు లాంటి ఈ జిగర్తాండ కథ ఏమిటి,మనవాళ్లకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్


గ‌ద్దల‌కొండ గ‌ణేష్ అలియాస్ గ‌నీ (వ‌రుణ్‌తేజ్‌) ఓ లోకల్ డాన్ … ఓ  గ్యాంగ్‌స్టర్‌. అతను తన వృత్తి ప్రకారం అడ్డువచ్చిన వాళ్లను అంతం చేస్తూ గద్దలకొండని ఏలుతూంటాడు. అయితే ఇలాంటి గ్యాంగస్టర్ కథలు తెలుగు వాళ్లకు బాగా నచ్చుతాయని ఆలోచించిన ఓ అసెస్టెంట్ డైరక్టర్  అభిలాష్ (అధ‌ర్వ) అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇంట్లో కూర్చుని, నాలుగు డీవిడిలు ముందేసుకుని చక్కగా కథ రాసుకోక…ఆ గ్యాంగస్ట్ లైఫ్ స్టయిల్ ని దగ్గర నుంచి చూసి, రియలిస్టిక్ అంశాలతో కథని అల్లుదామనుకుంటాడు. అందుకు బుజ్జమ్మ (మృణాళిని)ని రహదారిగా ఎంచుకుంటాడు. గణేష్ దగ్గర ఉండే బుజ్జమ్మ ని పట్టుకుని, ప్రేమలో పడేసి, గణేష్ కు దగ్గరై విషయాలు గేదర్ చేద్దామనుకుంటాడు. ఈ క్రమంలో చేసే ప్రయత్నాల్లో ఓ సారి గణేష్ కు దొరికిపోతాడు. అప్పుడు గణేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు. అభిలాష్ సినిమా చేయగలిగాడా…చివరకు ఏమైంది. గణేష్ జీవితంలో ఉన్న శ్రీదేవి (పూజాహెగ్డే) ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
 ఎనాలసిస్

ఈ సినిమా రీమేక్ అయినప్పటికి హరీష్ శంకర్ తన సొంత స్టైల్లో కథను మార్చుకుంటూ పోయారు. ముఖ్యంగా కథ చెప్పే పాయింటాఫ్ వ్యూనే మార్చేసాడు. అక్కడ విలన్ గా కనిపించే బాబి సింహా పాత్రలో వరుణ్ తేజ్ ని తీసుకురావటంతోనే సినిమా నేరేషన్ యాంగిల్ మారిపోయింది. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ లో జరిగే కథే అయినా   ఒరిజనల్ లో అందుకు పెద్దగా ప్రయారిటి ఇవ్వలేదు. హైలెట్ చెయ్యలేదు. కానీ తెలుగుకు వచ్చేసరికి ఆ సీన్స్ బాగా పెంచేసారు. కామెడీ చేసేసారు. ఓ గ్యాంగస్టర్ సినిమా చూద్దామని వెళ్లినవాళ్లకు ఈ సినిమా ఏ జానరో అర్దంకాని సిట్యువేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఫస్టాఫ్ లో అభి తను డైరక్టర్ అవ్వాలనే డ్రీమ్, కథ కోసం ఓ గ్యాంగస్టర్ ని ఎంచుకోవటం వరకూ ఓకే. ఆ తర్వాత గణేష్ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకుని వాడిని బార్ కు తీసుకెళ్లటం, అడల్ట్ సీడీలు చూపించి   ట్రాప్ చేసి తన పని చేసుకోవాలనుకోవటం వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయవు. ఇక తుపాకి రాజు ఎపిసోడ్ ద్రోహం రొటీన్ వ్యవహారమే. ఇక అభి, బుజ్జమ్మ  లవ్ ఎఫైర్ సైతం పెద్దగా పేలలేదు. మనం వరుణ్ తేజ కథ చూద్దామని వెళ్తే ఏదోదే చూపెడితే ఎలా?
 
ఇక సెకండాఫ్ లో అభి, గణేష్ లు ఇద్దరూ ఓ ఎగ్రిమెంట్ కు రావటం, గణేష్ ని హీరో గా చేసి సినిమాలు చేయాలనే ప్రయత్నం. సీటీమార్ అనే సినిమా ఇవన్ని కథలో ఏవీ మలుపులు తేవు. ఎక్కడా కాంప్లిక్ట్ క్రియేట్ చేయవు. దాంతో సెకండాఫ్ బోర్ గా మారిపోయింది. క్లైమాక్స్ సెంటిమెంట్ డోస్ …దగ్గరకు వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది.

 కలిసిరాని ఫ్లాష్ బ్యాక్

ఈ సినిమాకు హైలెట్ గా చెప్తూ ప్రచారం చేస్తున్న పూజ, వరుణ్ తేజ ల లవ్ స్టోరీ ప్లాష్ బ్యాక్ ఎందుకు పెట్టారో, అసలు దాని వలన కథకు ఉపయోగం ఏమిటి తరిచి చూసినా అర్దం కాదు. కేవలం వెల్లువచ్చే గోదారమ్మ రీమిక్స్ కోసం ఆ ఎపిసోడ్ ప్లాన్ చేసారనిపిస్తుంది.

వరుణ మంత్రం

ఈ సినిమాలో వరుణ్ తేజ మాత్రమే బాగా కష్టపడ్డాడని అర్దమవుతుంది. అతను గెటప్ , లుక్ , డైలాగ్ డెలవరీ అన్ని నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి. ఆ విషయంలో హరీష్ శంకర్ పాత్ర ఎంత ఉన్నా వరుణ్ కష్టం మాత్రం బాగా కనిపించింది.ఈ సినిమా చూసాక వరుణ్ ట్రాక్ లో పడ్డాడని అర్దమవుతుంది.

పూజ విషయానికి వస్తే…ఆమె కనపడేది కొన్ని సీన్స్ లో అయినా ఆకట్టుకుంది.  అధర్వ, మృణాళిని  మెప్పిస్తారు. స‌త్య, బ్రహ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, అన్నపూర్ణమ్మ, ర‌చ్చరవి, శ‌త్రు వీళ్లంతా అలవాటైన నటన చేసుకుంటూ పోయారు. డింపుల్ హ‌యాతి చేసిన స్పెషల్ సాంగ్ బాగుంది.

సాంకేతికంగా

టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్ట్స్ లోనే ఉంది.   ఐనాంక బోస్ ఈ తరహా గ్యాంగ్‌స్టర్ కథకు త‌గ్గట్టుగా స్పెషల్ లైటింగ్ స్కీమ్ ఫాలో అవటం తో ప్రత్యేక‌ంగా ఉంది. అలాగే ఆయన అనుభవం.., సీన్ మూడ్‌ కు తగినట్లు కెమెరా వర్క్ ఇవ్వటంలో ఉంది. మిక్కీ జె.మేయ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్.  ఎడిటర్ మాత్రం కత్తెరని మరింత షార్ప్ గా వాడాల్సింది.  14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎప్పటిలాగే బాగున్నాయి.   హ‌రీష్‌ శంక‌ర్ ద‌ర్శకుడిగా కన్నా డైలాగు రైటర్ గా మరోసారి తానేంచో చూపించారు.
 
చూడచ్చా

ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది

తెర వెనక ముందు…

న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్‌, అధ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే, మృణాళిని ర‌వి, స‌త్య త‌దిత‌రులు
ఛాయాగ్రహ‌ణం: ఐనాంక బోస్
పోరాటాలు: వెంక‌ట్‌
క‌ళ‌: అవినాష్ కొల్ల‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
స్క్రీన్‌ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య
ద‌ర్శక‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌