చాణక్య మూవీ రివ్యూ

Published On: October 5, 2019   |   Posted By:
చాణక్య మూవీ రివ్యూ
 
 
‘స్పై’ రా ( గోపీచంద్ ‘చాణక్య’ రివ్యూ)

 
Rating: 1.5/5


గోపీచంద్ కు హిట్ వచ్చి చాలా కాలం అయ్యిపోయింది. దాంతో ఏ కథాంశం ఎంచుకోవాలి..ఏ డైరక్టర్ తో ముందుకెళ్లాలి..ఎవరు తనకు హిట్ ఇస్తారు..ఏ జానర్ లో సినిమా చేస్తే వర్కవుట్ అవుతుంది అనేది క్వచ్చిన్ గా మారిపోయింది.  ఈ నేపధ్యంలో తన బాడీ లాంగ్వేజ్ కు, తన ఇమేజ్ కు స్పై సినిమా అయితే ఫెరఫెక్ట్ అని ఈ గూఢచారి సినిమాని గోపీచంద్ చేసారు. మరి ఈ సినిమా గోపిచంద్ అంచనాలకు తగినట్లు ఆడుతుందా..ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందా…గోపిచంద్ గా గూఢచారి కహాని ఏమిటి అనేది రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్ ఇదే..

అర్జున్ (గోపీచంద్) హై సక్సెస్ ఫుల్ రా ఏజెంట్.  అయితే ఆ విషయం ప్రపంచానికి తెలియచేయకుండా ఉండటం కోసం  ఓ బ్యాంక్ లో లోన్స్ రికవరీ సెక్షన్ లో  జాబ్ చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడే అతను కి ఐశ్వర్య (మెహ్రీన్)తో ప్రేమ వ్యవహారాలు గట్రా నడిపిస్తూంటాడు. ఈ లోగా ప్రొఫిషనల్ గా సీక్రెట్ గా.. అర్జున్  తన ప్రెండ్స్ లాంటి తన టీమ్ తో కలిసి ఓ ఆపరేషన్ చేస్తాడు. అందులో తేలేదేమిటంటే…మనదేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు కారణం పాక్‌ చెందిన ఇబ్రహీం ఖురేషీ అని  తెలుసుకుంటాడు .వెంటనే ఖురేషీకి చెందిన అబ్దుల్ సలీమ్‌ను అర్జున్‌  చంపేస్తారు.

దాంతో పగబట్టిన ఖురేషి అతడి కొడుకు సోహైల్ కలిసి.. అర్జున్ టీంలోని నలుగురు మెంబర్స్ ని  కిడ్నాప్ చేయించి పాకిస్థాన్ లోని కరాచీకు తీసుకెళ్లిపోతారు. అంతేకాదు ఓ ఛాలెంజ్ వదులుతారు. మీ స్నేహితులను విడిపించుకు వెళ్లమని. ఈలోగా నీ సేవలు మాకొద్దు..నీ ఐడెంటిటీ బయిటపడిపోయింది అంటూ ప్రభుత్వం అతన్ని ఉద్యోగంలోంచి తప్పిస్తుంది. అప్పుడు చేతిలో పవర్ లేకపోయినా అర్జున్ తన స్నేహితుల్ని ఎలా కాపాడుకున్నాడు.. ఖురేషి అతడి కొడుకు ఆట ఎలా కట్టించాడు,పరాయి దేశం పాకిస్దాన్ కు వెళ్లి దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ.

థ్రిల్లర్ కాదు…ప్రేక్షకులకు కిల్లర్

ఇంతకు ముందు అడవి శేషు ..గూఢ చారి సినిమా చేసాడు. ఆ సినిమాలో భారతదేశం తరుపున పనిచేసే రా ఏజెంట్స్ ఎలా ఉంటారు..వాళ్లకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు , వాళ్లు జీవితం ఎలా ఉంటుందనే విషయమై నిశిత పరిశీలనతో సినిమా చేసారు.  అయితే ఇక్కడా అలాంటి ప్రయత్నమే చేసారు. అయితే కమర్షియల్ యావలో పడి..కథను ప్రక్క దారి పట్టించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తాన్ని అర్దం పర్ధం లేకుండా, విషయం అనేది లేకుండా నడిపారు. ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి కథ కాంప్లిక్ట్ లోకి పడినా పరాయి దేశం అదీ పాకిస్దాన్ లో హీరో ఒంటిచేత్తో అక్కడ పెద్ద నెట్ వర్క్, బలం ఉన్న విలన్ ని ఎదుర్కోవటం అనేది ఓ పిక్షన్ లా నడిపారు. దాంత్ స్పై థిల్లర్ కాస్తా ..ప్రేక్షకుల పాలిటి కిల్లగా మారిపోయింది.
 
ఓ పెద్ద గూఢచారి బ్యాంక్ ఉద్యోగిగా పనిచేయటం అనేది మంచి విషయం. విశ్వరూపంలో కమల్ డాన్స్ టీచర్ లా చేసినట్లు ఉత్కంఠతో నడపాల్సిన ఎపిసోడ్స్. లేదా ఫన్ తో నడిపించాల్సిన సీన్స్. రెండు కాకుండా తమకు తోచినట్లు తీసి బోర్ కు బ్రాండ్ సిడర్ గా తయారు చేసారు. ఇక హీరో ఈ సినిమాకు పెట్టిన టైటిల్ చాణుక్య అన్నదానికి అయినా న్యాయం చేస్తూ కొన్ని తెలివితేటలు ప్రదర్శించాల్సింది.  అదీ లేదు. కాకపోతే సెంకడాఫ్ లో ట్విస్ట్ లు మాత్రం వర్కవుట్ అయ్యాయి.
 
 
 
తిరు క్షవరం….

దర్శకుడుగా తిరు ఈ సినిమాలో ఊడబొడిచిందేమీ కనపడదు. తమిళ దర్శకుడు మేధావి అని తెచ్చిపెంటే మేతావులే అని తేలిపోతున్న విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.కథ,కథనం ఎంపిక దగ్గరే చతికిలిపడిన ఈ సినిమా ఆ తర్వాత చూడ్డానికి వచ్చినవాడిని చాకిరేవు బండకేసి బాదుతున్నట్లు బాదుతుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ దృశ్యాలే తప్ప కథ డిమాండ్ చేసే సీన్స్ ఎక్కడా కనిపించవు. ఇక అలీ కామెడీ అయితే సినిమాలంటేనే విసుగు వచ్చేస్తుంది. కెమెరా వర్క్ బాగుంది.. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు కష్టమనిపిస్తాయి. మిగతా విభాగాలు సోసోగా ఉన్నాయి.

 
చూడచ్చా

స్పై సినిమాలంటే ఆసక్తి, సోది చెప్పినా వినే శక్తి ఉండటం అర్హత

తెర ముందు..వెనక
 
బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనాఖాన్‌, సునీల్‌, అలీ, ర‌ఘుబాబు, రాజా, ఆదర్శ్ బాల‌కృష్ణ‌, నాజర్‌, జ‌య్ర‌ప‌కాశ్‌, భ‌ర‌త్, ఉప‌న్ ప‌టేల్‌ త‌దిత‌రులు
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి ప‌ళ‌నిస్వామి
రైట‌ర్‌: అబ్బూరి ర‌వి
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు