చిత్రపురి వాసులకు కరోనా పరీక్షలు

Published On: August 12, 2020   |   Posted By:
చిత్రపురి వాసులకు కరోనా పరీక్షలు
 
మనం సైతం’ ఆధ్వర్యంలో చిత్రపురి వాసులకు కరోనా పరీక్షలు
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలలో భయాందోళనలు పోగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా పరీక్షలు వాహనం ద్వారా నిర్వహించాలని “మనం సైతం”కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేయగా మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర GHMC వారి సౌజన్యంతో మొబైల్ టెస్ట్ సెంటర్ ను చిత్రపురిలో ఏర్పాటు చేశారు.
 
చిత్రపురి నాయకులు వినోద్ బాల, వల్లభనేని అనిల్ బృందం సారధ్యంలో  చిత్రపురి కాలనీ వాసులంతా ఈ అవకాశాన్ని  సద్వినియోగ పరుచుకుని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విజయవంతం చేసినందుకు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.