‘చిత్రలహరి’ సినిమా రివ్యూ

Published On: April 12, 2019   |   Posted By:

‘చిత్రలహరి’ సినిమా రివ్యూ

పాఠాల ‘చిత్రలహరి’ (రివ్యూ)

రేటింగ్  : 2/5   

అనగనగా ఓ కుర్రాడు. అతని పేరు    విజ‌య్ కృష్ణ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌) . అతని పేరులోనే కాని అతని జీవితంలో విజయం అంటూ లేదు. ఇంజినీరింగ్ చేసినా…తెలివితేటలు ఉన్నా ఫలితం సున్నా. ఇలాంటి పరిస్దితుల్లో తన ప్రేస్టేషన్ ని మందు గ్లాస్ ముందు పెట్టి కాలక్షేపం చేస్తున్న అతని జీవితంలోకి ల‌హ‌రి (క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) ప్రవేశిస్తుంది. ఆమె తెలివైందా అంటే ..తనో తింగరి. ప్రతీ దానికి ఒకరిపై ఆధారపడి డెసిషన్స్ తీసుకునే మనస్తత్వం. అలాంటి ఆమె విజయ్ కృష్ణతో ప్రేమలో పడుతుంది. విజయ్ కృష్ణ కూడా తన జీవితంలో ఏదో అద్బుతం జరగబోతోందన్నట్లు ఫీల్ అవుతాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు ఉండదు. ఆమె తన స్నేహితురాలు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌)  మాటలు విని బ్రేకప్ చెప్పేస్తుంది.

మళ్లీ మన హీరోకు తన గ్లాస్ మేట్స్ తో బాధపడటం తప్ప మిగిలిందేమీ కనపడదు. అయితే అతనిలో ఓ రగిలే జ్వాల ఉంటుంది. అది ఓ స్టార్టప్ ఐడియా. అది కనుక వర్కవుట్ అయితే జీవితమే మారిపోతుంది. దాని పేరు ‘యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్’. కానీ ఆ ఐడియాని నమ్మి పెట్టుబడిపెట్టేవాళ్లు ఎవరూ కనపడరు. అప్పుడు తనే ఆ ఐడియాని ప్రూవ్ చేయాలనుకుంటాడు. అందుకోసం తను ఇంటిన్షనల్ గా యాక్సిడెంట్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఏమైంది. యాక్సిడెంట్ నుంచి విజయ్ బయిటపడ్డాడా..  తన ఐడియా నిజంగా వర్కవుట్ అయ్యిందా…బ్రేకప్ అయిన అమ్మాయి మళ్లీ జీవితంలోకి వచ్చిందా..ఎప్పటికైనా సక్సెస్ అయ్యి విజయ్ బ్రేకింగ్ న్యూస్ లో నిలిచాడా వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే…

ఈ సినిమా ని దర్శకుడు ఎపిసోడిక్ గా తీర్చి దిద్దాడు. అంతేతప్ప ఓ కథగా డీల్ చేయలేదు. వరస ఫెయిల్యూర్స్ ఉన్న ఓ కుర్రాడు..చివరకి ఎలా సక్సెస్ అయ్యాడు అన్నది చూపించాలనుకున్నాడు. కానీ ఆ ఇంటిన్సిటీని తెరపై తేలేకపోయాడు.  దాంతో వరస ఫెయిల్యూర్ ఉన్న కుర్రాడి కథ ఏం చూస్తాం అనే విసుగువస్తుంది. అంతేకానీ ఎలాగైనా హీరో సక్సెస్ అవ్వాలని కోరుకోం. అలా కాకుండా అతనికో టార్గెట్ పెట్టి ..ఫలానా స్టార్టప్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. అందులో ఫలానా ఇబ్బందులు వచ్చాయి…వాటిని ఇలా అధిగమనించాడు  అంటే ఖచ్చితంగా ఇన్సిప్రేషన్ గా ఉండేది.

తేజూ కెరీర్ కు పనికొస్తుందా

ఇక ఈ సినిమాలో తన జీవితానికి దగ్గరలో ఉన్న పాత్రలో తేజు కనపడటంతో చాలా ఈజ్ చూపించాడు. నటుడుగా ఫెయిల్ కాలేదు. కానీ కథ అతన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లలేదు. దాంతో ఈ సినిమా తేజూ కెరీర్ కు పనికొస్తుందా అంటే అనుమానమే అని చెప్పాలి.

స్క్రిప్టే సమస్య

ఈ సినిమా కు స్క్రిప్టే దెబ్బ కొట్టింది. హీరో పాత్రని తీసుకుని అతని పాయింటాఫ్ లో కథ నడపకుండా అతని జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు కథలు చెప్తే ఏమి ఇంట్రస్ట్ ఉంటుంది. అదే సాయి తేజ కొత్త హీరో అయితే ఈ సినిమా మల్టిఫుల్ లేయిర్స్ కథగా అలరించేది. కానీ ఆల్రెడీ సాయి ఆ స్టేజి దాటేసాడు.

టెక్నికల్ గా 

 డైలాగులు బాగున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్. అలాగే పాటల్లో గ్లాస్ మెట్ సాంగ్ తో పాటు మరో రెండు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.  ఎడిటింగ్ కాస్త స్పీడ్ చేయాటానికి అవకాసం ఉన్నా వదిలేసినట్లుంది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

చూడచ్చా

మెసేజ్ సినిమాలు ఈ మధ్యకాలంలో రావటం లేదు…అని బాధపడేవాళ్ళు ఈ సినిమాని చూడచ్చు. అలాగని మరీ తీసిపారేసేంకాదు ఓ వీకెండ్ ఏసీ హాలులో కాలక్షేపం ఇస్తుంది. 

ఆఖరి మాట

ఫెయిల్యూర్ స్టోరీలు కూడా ఇంట్రస్టింగ్ గా చెప్తే సక్సెస్ అవుతాయి. కానీ సక్సెస్ స్టోరీ కూడా నీరసంగా చెప్తే ఫెయిల్ అవుతాయి.

ఎవరెవరు

సినిమా: చిత్ర ల‌హ‌రి

సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సీవీ మోహ‌న్‌

తారాగ‌ణం: సాయితేజ్‌, నివేదా పెతురాజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్‌, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని

ఆర్ట్: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కిశోర్ తిరుమ‌ల‌