చిరంజీవి ముందుచూపు

Published On: November 18, 2017   |   Posted By:
చిరంజీవి ముందుచూపు
సైరా స‌ర‌సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌లో చిరంజీవి వెన‌క్కి తిరిగి ఉన్న ఫొటోను విడుద‌ల చేశారు. అయితే ఇప్పుడు ముందు చూపు కూడా అదిరిపోయింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌లే టెస్ట్ షూట్‌లు జ‌రిగాయ‌ట‌. దాదాపుగా ఏడాది కాలంగా జ‌రుగుతున్న స్క్రిప్ట్ వ‌ర్క్ మొత్తం పూర్త‌యింద‌ట‌. డిసెంబ‌ర్ నుంచి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో సైరా న‌ర‌సింహారెడ్డి  రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త‌న‌య సుష్మిత కొణిదెల రూపొందించిన కాస్ట్యూమ్స్ చిరంజీవికి మ‌రింత‌గా సూట్ అయ్యాయ‌ట‌. ఈ సినిమాతో సుష్మిత కొణిదెల పేరు మారుమోగ‌నుంద‌ని అంటున్నారు. టాప్ డిజైన‌ర్స్ లో ఆమె పేరు త‌ప్ప‌క చేరుతుంద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. కోర మీసాల‌తో క‌నిపించ‌నున్న చిరంజీవి లుక్ సినిమాకు పెద్ద హైలైట్ అని అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ర‌త్న‌వేలు కెమెరాను, ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చనున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. న‌య‌న‌తార నాయిక‌. ర‌త్న‌వేలు ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న `రంగ‌స్థ‌లం` సినిమాకు కెమెరామేన్‌గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.