చిరు రీ ఎంట్రీకి ఏడాది

Published On: January 11, 2018   |   Posted By:
చిరు రీ ఎంట్రీకి ఏడాది
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే రికార్డులు భూస్థాపితం అవుతాయి. క‌లెక్ష‌న్లు కొత్త బాట ప‌డ‌తాయి. సంచ‌ల‌న విజ‌యాలు స్వాగ‌తం ప‌లుకుతాయి. అలాంటి చిరు.. రాజకీయాల్లోకి ఎంట‌ర‌య్యాక.. క‌థానాయ‌కుడి అవ‌తారం ఎత్త‌డానికి దాదాపు ప‌దేళ్లు విరామం తీసుకున్నారు. రీ ఎంట్రీ కోసం ఎన్నో క‌థ‌లున్నా.. చివ‌రాఖ‌రికి రైతుల నీటి క‌ష్టాల నేప‌థ్యంతో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం క‌త్తి ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించింది. క‌ట్ చేస్తే.. అదే సినిమా ఖైదీ నెం.150 రూపంలో తెర‌పైకి వ‌చ్చింది. ఠాగూర్ వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించిన ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్ ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసారు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాటలు యువ‌త‌ని ఉర్రూత‌లూగించాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా రూ.100 కోట్ల‌కి పైగా షేర్ రాబ‌ట్టుకుని ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌టికీ నాన్ – బాహుబ‌లి రికార్డులు ఈ సినిమాకే సొంతం. చిరు రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పిన ఈ సినిమా.. గ‌తేడాది ఇదే జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది. అంటే.. చిరు రీ ఎంట్రీకి ఏడాది పూర్త‌య్యింద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం చిరు భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డితో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.